సమాచారం ఇచ్చి పుచ్చుకునే ప్రక్రియ మానవాళికి బహుళ పధ్ధతులలో సంక్రమించిది.దృశ్య,శ్రవ్య పద్ధతులు వీటిలో ప్రధానమైనవి. ప్రస్తుతం మనిషి యంత్రం అనే ప్రధాన సాధనం ద్వారా దీనిని పొందుతున్నాడు. సమాచార మార్పిడి మాత్రం యంత్రం సానుకులత పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది కాని మనిషి సౌకర్యం పైనకాదు. మౌస్, కీ బోర్డ్, అనేవి ప్రధాన ఇన్ పుట్ ఉపకరణాలు కాగా దృశ్య ప్రధానమైన మానిటర్ ప్రధాన ఉత్పాదక (లేక) ఔట్ పుట్ పరికరమైనది. ఇలాంటి కంప్యూటర్ ప్రక్రియలను వినియోగించడానికి ప్రత్యేక నైపుణ్యం, మానసిక సంకల్పం అవసరం. అయితే చాలమందికి ఈరకం నైపుణ్యం అబ్బే అవకాశం లేదు. అలాంటప్పుడు కంప్యూటరుకు ఉన్న ఈ శక్తి సామర్ధ్యాల ద్వారా ప్రజలంతా ప్రయోజనం పొందాలంటే సమాచార మార్పిడి పద్ధతి సమూలంగా మారాలి. యంత్రమే ప్రధాన పాత్ర పోషించే సమాచారవ్వవస్థను మానవ ప్రాబల్యంగల వ్యవస్థగా మనం మార్చాలి. సమాచారాన్ని గ్రహించడంలో దృశ్యపద్ధతి చాలా బలమైనది అయినప్పటికి మౌఖిక పద్ధతి కూడా సమాచారం అందజేయడానికి సానుకూలమైనది, అందరూ ఇష్టపడేది కూడా. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్ల వ్యవస్ధలు విస్తృతంగా వ్యాపించిన ఈ రోజుల్లో ప్రజలు మారుమూల ప్రాంతాల సమాచారం కూడా సులభంగా తెలుసుకోగలుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో మాటల ద్వారా, సంభాషణ ద్వారా సమాచారం పంపడం మరింత సానుకూలంగా, పటిష్టంగా రూపొందింది.
ఇలాంటప్పుడు సమాచారం అందచేయడంల్లోమౌఖిక పద్ధతికి మరింత ప్రాధాన్యం వచ్చింది. మౌఖిక పద్ధతి ద్వారా సమాచారం అందచేయడానికి సహజమైన భాష అవసరమవుతుంది. ఈ కారణంగానే సమాచార సాంకేతిక విజ్ఞాన వ్యవస్థలో భాషా శాస్త్రం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందువలనే మానవ ప్రాబల్యంగల కంప్యూటర్ సమాచార వ్యవస్థ ఈ నాడు మనకు అవసరమైంది. భాష అనే సాధనం కేవలం మానవులకే లభించిన అరుదైన అద్భుత వరం. సమాచారాన్ని, భావాలను, అలోచలనలను పరస్పరం సులభంగా పంచుకోడానికి మానవాళికి భాషే సరైన సాధనం. సహజమైన మానవ భాషను ఉపయోగించి మనిషి,యంత్రం మధ్య పరస్పర క్రియను రూపొందించాలంటే మానవ భాషకు సంబంధించిన అనేక అంశాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది. మానవ భాష యొక్క సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన అనేక అంశాలకు ప్రమేయం కల్పించడం అవసరం. అవి ప్రసంగాన్ని సంక్షిప్తం చేయడం, ప్రసంగాన్ని, లిపిని గుర్తించి అర్ధం చేసుకోవడం, యంత్రసహాయంతో అనువాదం, ప్రసంగ పాఠాన్ని తయారు చేయడం, సంభాషణా సమన్వయం, గొలుసుకట్టు లిపిని సంశ్లేషణ చేయడం, అందుకు సంబంధించిన కొన్ని ప్రక్రియలు రూపొందించడం. మౌఖిక భాష అయినా, లిఖిత భాష అయినా ఇక్కడ మెషిన్ తో అవసరమైన పరస్పరచర్యకు ఉపయోగకరంగానే ఉంటాయి.
కంప్యూటర్ పై భారతీయ భాషలకు సంబంధిచిన పనిచేయడం గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. డాటా ప్రాసెసింగ్, వర్డ్ ప్రాసెసింగ్, డెస్క్టాప్ పబ్లిషింగ్ తదితర ప్రక్రియలుకూడ వేర్వేరు విధానాల్లో రెండు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి.
సమాచార మార్పిడికి ఉపకరణాలను, మెలకువలను రూపొందించేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ భారతీయ భాషలకోసం సాంకేతిక విజ్ఞానాభివృద్ధి (టి.డి.ఐ.ఎల్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. భాషాపరమైన అడ్డంకులు లేకుండా మనిషి, యంత్రం (కంప్యూటర్) మధ్య పరస్పర క్రియను రూపొందించడం, బహుళ భాషల విజ్ఞాన వనరులను ఏర్పాటు చేయడం , సృజనాత్మకమైన సమాచార ఉత్పాదనలను, సేవలను రూపొందించడం వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. కార్పోరా,నిఘంటువులు వంటి భాషా శాస్త్రవనరులను అభివృద్ధి చేసే పధకాలకు ఆర్ధిక సహాయం అందించారు. ఫాంట్లు, టెక్ట్స్ ఎడిటర్, పదబంధాల పరిశీలనావ్యవస్ధ, ఓసిఆర్, టెక్ట్స్ టూ స్పీచ్ వంటి సమాచార ప్రకియ ఉపకరణాలను రూపొందించేందుకు కూడా పధకాలు చేపట్టారు, వాటికి అవసరమైన ఆర్ధిక సహాయం అందించారు. వీటికి సంబంధించిన ప్రమాణాలను కూడా రూపొందించారు.
భారతీయ భాషా సాంకేతిక విజ్ఞాన ఉత్పత్తుల సేవలను రూపొందించడానికి ప్రభుత్వస్ధాయిలో, ప్రైవేట్ స్ధాయిలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా కృషి జరిగింది. సూచనలు, సలహాలు రూపొందించేందుకు ‘రిసోర్స్ సెంటర్లు’ కాల్ నెట్ సెంటర్లు, తయారు చేసిన భాషాపరమైన సాంకేతిక మెలుకువలను, ఉపకరణాలను వేగంగా ఉపయోగంలోకి తీసుకురావలసి ఉంది. అయితే పరిశోధన, అభివృద్ధి, వీటి కృషి ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉండేట్లు చూడటం అవసరం. ఆభివృద్ధి కృషి ఫలితాలు కేవలం లాబొరేటరికే పరిమితం కాకూడదు.అవి ప్రజాప్రయోజనానికి విస్తృతంగా ఉపయోగపడాలి. వినియోగదారుల సూచనలు, సలహాలు, అనుభవాలతో ఈ ఫలితాలు భవిష్యత్తులో మరింత పరిపుష్టం కావాలి.
సమాచార మార్పిడికి సంబంధించి వచ్చే సంవత్సరానికిగాను ఈ కింది ఉత్పత్తులను, పరిష్కారాలను అందజేసేందుకు ప్రభుత్వం సార్వజనిక రంగంలో ముందుకువస్తోంది.
-
అన్ని భారతీయ భాషలలోను ఉచిత ఫాంట్లు (టి.టి.ఎఫ్ మరియు ఓ.టి.ఎఫ్), వర్డ్ ప్రాసెసర్లు, తొలి చర్యగా సార్వజనిక రంగంల్లో ఉచితంగా విడుదల చేయడానికి ప్రాచీనభాష తమిళం,హిందీలకు గాను ప్రజాదరణ పొందిన ట్రూటైప్ ఫాంట్లను ఎంపిక చేశారు. పుస్తక ప్రచురణ పరిశ్రమతో చర్చలు, సంప్రదింపుల అనంతరం ఈ ఎంపిక జరిగింది. విండోస్ 95, విండోస్ 98, విండోస్ ఎన్.టి ప్లాట్ ఫాం కలిగిన కంప్యూటర్ వ్యవస్ధలలో టి.టి.ఎఫ్. ఫాంట్లను విస్తృతంగా వినియోగిస్తున్నారు. విండోస్ 2000/X.P./2003, లీనక్స్ ఫ్లాట్ ఫాంల సిస్టమ్స్ కు ఓపెన్ టైప్ ఫాంట్లు విడుదల చేస్తున్నారు. ఇలాంటి కృషి జరగడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఉన్న వర్డ్ ప్రాసెసర్లు గాని,లేదా కొత్త వర్డ్ ప్రాసెసర్లుగాని ఈ ఫాంట్లును వినియోగించుకోగలవు. దీని వల్ల డాటా ఎంట్రీ కోసం ఇన్స్ క్రిఫ్ట్, ఫొనెటిక్, టైప్రైటర్, కీ బోర్డ్ వ్యవస్ధలు కలిగిన సిస్టమ్ లకు మరిన్ని ఫాంట్లు అందుబాటులోకి వస్తాయి.
-
సమాచారాన్ని గ్రహించడం, వెనక్కు తీసుకోవడం, కంప్యూటర్ ప్రాసెసింగ్ కు అనువుగా ఉండేలా డిజిటల్ రూపంలోకి మార్చడం వంటి ప్రక్రియలకోసం ఆప్టికల్ క్యారెక్టర్ రికెగ్నిషన్ పరిష్కారాన్ని రూపొందిచారు. స్కాన్ చేసిన ఎదైనా చిత్రాన్ని మనకు అనువైన రీతిలో సవరించుకొని టెక్ట్స్ గా మార్చుకోవడానికి ఓ.సి.ఆర్. వీలుకలిగిస్తుంది. పుస్తక ప్రచురణ పరిశ్రమకు ఈ సాఫ్ట్ వేర్ పుస్తకాల కొత్త ఎడిషన్లు తీసుకురావడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది.
-
సంభాషణకు సంబందించిన కంప్యూటర్ ప్రోగ్రామ్, రైల్వే సమాచారం, ఆరోగ్యరక్షణ, వ్యవసాయం, ప్రకృతి వైపరిత్యాల వల్ల విపత్కర పరిస్ధితి, నిర్వహణ, తదితర ప్రజోపయోగ సర్వీసుల్లో ఈ సాఫ్ట్ వేర్ ఉపయోగకరంగా ఉంటుంది. భారతీయ భాషలలో అధునాతన సాంకేతిక పరిజ్ఞాన ప్రయోజనాలు ప్రజలకు ఇది దోహదపడుతుంది. సిస్టమ్ లోని ప్రోగ్రామ్ సంభాషణను గుర్తించే వ్యవస్ధద్వారా మానవ కంఠ స్వరాన్ని గుర్తించి దాన్ని టెక్ట్స్ గా మార్చుతుంది.
-
బ్రౌజర్లు , సమాచారం కోసం అన్వేషణ జరిపే సెర్చ్ ఇంజన్లు, ఇ.మెయిల్ వంటి ఇంటర్ నెట్ ఉపకరణాలను భారతీయ భాషలకు అందుబాటులో ఉంచడం. ఈ ఏర్పాటువల్ల భారతీయ భాషలలో ఇ.మెయిల్ ద్వారా సందేశాలు, సమాచారం, పంపడం సులభతరం అవుతుంది. ఇతర భారతీయ భాషలలో సమాచారం అన్వేషణకు సెర్చ్ ఇంజను వీలు కలిపిస్తుంది. ప్రశ్నఏ భారతీయభాషలోవేసినా జవాబు దీనిద్వారా వస్తుంది.
-
భారతీయ భాషలలోను, ఇంగ్లీషులోను పరస్పర అనువాదం చేయగలిగే అన్ లైన్ ఉపకరణాలు. ఇంగ్లీషులో లేదా ఏదైనా ఇతర భారతీయ భాషలో ఉండే విషయాన్ని, సమాచారాన్ని ఎవరైనా తమకు అవసరమైన భాషలోకి అనువదించుకోవడానికి ఈ ఉపకరణం తోడ్పడుతుంది.
ఈ సాఫ్ట్ వేర్ ఉత్పత్తులను, సేవలను, టి.డి.ఐ.ఎల్. సమాచార కేంద్రం ద్వారా ఆన్ లైన్ హెల్ప్ డెస్క్ లో అందుబాటులో ఉంచుతున్నారు.
భాషా సాంకేతిక విజ్ఞానం, పంపిణి ఏర్పాటుకు సంబందించి ప్రభుత్వం ఒక కాల బద్ధమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొంది. ఈ రంగంలో పరిశోధన, ఉత్పత్తులను, సేవలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ ప్రణాలికను రూపోందించింది. ఇందు కోసం ప్రభుత్వం ఈ క్రింది చర్యలు తీసుకొంటుంది.
- అభివృధ్ది చెందిన సాంకేతిక మెలకువలను మార్కెట్ లో ప్రవేశపెట్టడం.
- ఉత్పత్తులను రూపొందించడానికి సాంకేతిక విజ్ఞాన మెలుకవల స్ధాయి, ప్రమాణాలను పెంచడం.
- అవసరం ప్రాతిపదికగా కొత్త సాంకేతిక మెలుకువలను రూపొందించడం.
ఈ లక్ష్యాలను సాధించేందుకు ఈ క్రింది చర్యలు తీసుకుంటుంది.
-
భారతీయ భాషా సాంకేతిక విజ్ఞాన మెలుకువల ఉపకరణాలను టి.డి.ఐ.ఎల్. సమాచార కేంద్రం ద్వారా దశలవారిగా పంపిణీ చేయడం.
-
పరిశోదన ద్వారా రూపొందించిన ఉపకరణాలను,ఉత్పత్తులను,సేవలను సంపాదించుకోవడం.
-
ఈ ఉపకరణాల ఉపయోగానికి సంబంధించిన అవగాహనను విస్తృతం చేయడం, భాషా సాంకేతిక విజ్ఞాన రంగంలో ప్రభుత్వం సాగించే కృషి గురించి అందుబాటులోని ఉపకరణాల ద్వారా ప్రచారం చేయడం.
-
. ఉపకరణాలు, ప్రయోజనాలు వంటివాటి, ఉత్పత్తులు యూజర్లు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకొనే వీలు కలిపించడం.
-
భాషా సాంకేతిక విజ్ఞాన రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ బాగస్వామ్యాన్ని ప్రొత్సహించడం.
-
ప్రత్యేకమైన అప్లికేషన్ రంగాలకు సంబందించి కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం
|